తెలుగు మహిళ శైలజా సుమన్ కి .. అరుదైన గౌరవం దక్కింది ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత విజయవాడలోని దూరదర్శన్‌ సప్తగరి కేంద్రానికి కొంత కాలం డైరెక్టర్‌గా పనిచేశారు.

 తెలుగు మహిళ శైలజా సుమన్ కి .. అరుదైన గౌరవం దక్కింది. ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్ గా ఆమె ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ కేంద్రానికి డైరెక్టర్ బాధ్యతను చేపట్టిన తొలి మహిళ ఈమే కావడం విశేషం. శైలజా సుమన్‌ ..చాలాకాలం హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి డైరెక్టర్‌గా వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత విజయవాడలోని దూరదర్శన్‌ సప్తగరి కేంద్రానికి కొంత కాలం డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఏకంగా దేశ రాజధానిలోని ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.

శైలజా సుమన్ ది గుంటూరు జిల్లా.

1982లో ఆమెకు పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఉద్యోగం వచ్చింది. మాస్‌ కమ్యూనికేషన్‌ జర్నలిజంలో పిజి డిప్లమా కూడా చేశారు. విద్య ఆవశ్యకతపై ఆమె రూపొందించిన డాక్యుమెంటరీకి స్వర్ణనంది లభించింది. బతుకమ్మ బోనాల వంటి పండుగలపైన, రిపబ్లిక్‌ డే వంటి జాతీయ ఉత్సవాలపై ఆమె చేసిన కవరేజీలకు ప్రశంసలు లభించాయి. 'ముహూర్తబలం పేరుతో ఆమె దూరదర్శన్‌లో ప్రసారం చేయించిన 153ఎపిసోడ్లకు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి. ఆమెకు ఏడుసార్లు నంది అవార్డు వరించింది.

ప్రధాని నరేంద్రమోడీ నెలనెలా చేసే ' మన్‌ కీ బాత్‌ ’(మనసులో మాట) ప్రసార కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను నూతనంగా చేపట్టారు.