పాసుపోర్టు కావాలా.. సన్యాసుల్లో కలవండి

Sadhus can now get passport under Gurus name
Highlights

సవాలక్ష ప్రశ్నలతో వేధించి, ఫ్రూఫ్ లు కావాలని విసిగించే పాసుపోర్టు ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేసింది.

 

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నిజంగా ఇది శుభవార్తే. పాసుపోర్టు రావడంలేదని ఇకపై తెగ బాధపడిపోకండి. సన్యాసుల్లో కలవండి పాసుపోర్టు ఈజీగా వస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ.

 

నిజమండీ బాబు... సవాలక్ష ప్రశ్నలతో వేధించి, ఫ్రూఫ్ లు కావాలని విసిగించే పాసుపోర్టు ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేసింది.

 

ఇకపై సాధువులు, సన్యాసులకు కూడా పాసుపోర్టును సులభంగా ఇచ్చేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

 

సాధువులు ఇకపై పాసుపోర్టు కావాలంటే తమ తల్లిదండ్రుల పేర్లు వెల్లడించాల్సిన అవసరం లేదు. తమ గురువు పేరు చెబితే సరిపోతుంది. పాసుపోర్టును ఇచ్చేస్తారు.

 

అంతేకాదు... బర్త్ సర్టిఫికేట్ కు సంబంధించి కూడా మినహాయింపులు ఇచ్చారు. దానికి బదులు ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డులు ఇస్తే సరిపోతుంది.

 

 

దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ కేంద్ర నిర్ణయాలను వెల్లడించారు.

loader