క్రికెట్‌ మెగాస్టార్  సచిన్‌ తెందుల్కర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  సినిమా ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ ఈ నెల 26న విడుదలవుతున్నది. సినిమాను ఐదు భాషల్లో, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠి, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు  చిత్ర నిర్మాత రవి భాగ్‌చం ప్రకటించారు.

క్రికెట్‌ మెగాస్టార్ సచిన్‌ తెందుల్కర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ ఈ నెల 26న విడుదలవుతున్నది.

సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

హిందీ, ఇంగ్లిష్‌, మరాఠి, తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతుందని చిత్ర నిర్మాత రవి భాగ్‌చంద్క తెలిపారు.

దీనిమీద ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సచిన్ తెందుల్కర్ భాషాతీతమయిపోయాడు. మన భారతీయులంతా గర్వించదగ్గ ఒక యుగాన్ని ఆయన ప్రారంభించాడు. భాష అడ్డుగోడకాకుండా ఆయన జీవిత చరిత్రను ప్రతిఒక్కరు తిలకించాలి,’ అని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎంతో మందికి ‘సచిన్ ’ స్ఫూర్తిని వ్వాలని, ఈ సినిమా చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలని పలు ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తున్నట్లు రవి చెప్పారు. జేమ్స్‌ ఎర్స్ కైన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.