ఎన్నికలు సమీపిస్తున్నాయి అనగానే.. ఎన్నికల అధికారులు ముందుగా చేసే పని పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం. మనదేశంలో గ్రామానికో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుంటారు. కాస్త జనాలు తక్కువగా ఉన్నారు అనిపిస్తే.. రెండు మూడు గ్రామాలకు కలిపి కూడా ఒకే పోలింగ్ కేంద్రాన్ని పెడతారు. ఉదయం 7గంటలకు మొదలైతే.. సాయంత్రం 4గంటల వరకు జనాలు ఓటు వేయడానికి క్యూలుకడుతుంటారు. మరి కొందరైతే.. చాలా దూరం వెళ్లి మరీ ఓటు వేస్తుంటారు కూడా. ఇది మన దేశంలో పోలింగ్ వ్యవస్థ. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారత్ లో ఎన్నికల సిస్టమ్ ఉంది కదా.. ఎప్పుడైనా కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారా..? ఛాన్సే లేదు అంటారా.. అవును.. కానీ రష్యా మాత్రం కేవలం ఒక వ్యక్తి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

 

మీరు చదివింది నిజమే. కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అది కూడా పక్క దేశంలో. రష్యాలో మార్చి 18 నుంచి ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశానికి చెందిన వ్లాడ్మిర్ అనే వ్యక్తి దక్షిణ కొరియా రాజధాని  ప్యాంగ్ యాంగ్ లో ఉంటున్నాడు. అతని ఓటును కూడా కీలకంగా భావించిన రష్యా ప్రభుత్వం.. ప్రత్యేకంగా అతని కోసం ప్యాంగ్ యాంగ్ లో ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  ఈ విషయాన్ని రష్యా ఎంబసీ అధికారికంగా ప్రకటించింది. వ్లాడ్మిర్ తండ్రి నార్త్ కొరియన్ కాగా.. అతని తల్లి రష్యన్. వీరిద్దరూ 1950లో కంచట్క ప్రాంతంలో కలుసుకొని తర్వాత ఒక్కటయ్యారు. వీరి సంతానమైన వ్లాడ్మిర్.. నార్త్ కొరియాలో నివసిస్తుండగా.. అతనికి రష్యాలో ఓటు హక్కు ఉంది. దీంతో.. అతను సరిహద్దులు మారినా.. అతని కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.