Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడ ఏటీఎంలలో నో క్యాష్.. అక్కడ బస్సులోనే రూ.100కోట్లు

ప్రైవేటు బస్సులో రూ.100కోట్ల నగదు స్వాధీనం
rs100 crore found in private bus in karnataka

ఓ పక్క హైదరాబాద్ నగరంలోని ఏటీఎంలలో నగదు లభించక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా ఏటీఎం వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకుల్లో కూడా సరిపడ నిధులు లేవని అందుకే ఏటీఎంలలో క్యాష్ రావడంలేదనే వాదనలు వినపడుతున్నాయి. ఇలా ఉంటే..  ఓ ప్రైవేటు బస్సులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్ల నగదు లభించింది.

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా తిప్పగానిపల్లి వద్ద పోలీసులు ఓ ప్రైవేటు బస్సులో రూ.100కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం-బళ్లారి జాతీయరహదారిపై తిప్పగానిపల్లి వద్ద ఈరోజు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు లెక్కించగా రూ.100కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది. ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంత మొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios