ముందుంది ముసళ్ల పండుగ: మండనున్న పెట్రోల్, డీజిల్

Rs 4 a litre hike in petrol, diesel prices coming up
Highlights

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల వల్లనే ఇంత కాలం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వాయిదా వేశారు. దానివల్ల ప్రభుత్వ రంగ ఇంధన సరఫరా కంపెనీల లాభాల్లో కోతపడింది. 

ఆ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం కారణంగా ఇంధన ధరలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల వల్ల వాయిదా పడిన ధరల పెంపు వల్ల ఆగిపోయిన ధరల పెంపును అందుకుని ఇంధన సరఫరా కంపెనీలు లాభాల స్థాయిని పెంచుకోవాల్సి ఉంటుంది. 

ఆ కారణంగా రూ.4 పెంచాల్సి ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌లు గత సోమవారం ఇందన ధరల సమీక్షను మళ్లీ ప్రారంభించాయి. కర్ణాటక ఎన్నిలు ముగిసిన తర్వాత ఓసారి ధరలు పెరిగాయి. 

దాదాపు 19 రోజుల పాటు ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆ తర్వాతఇందన ధరల సమీక్ష తిరిగి ప్రారంభమైంది. ఈ స్థితిలోపెట్రోల్‌ ధర 69పైసలు పెరిగింది. గురువారం ఒక్కరోజే 22పైసలు పెరిగింది. 

loader