టీవీ షోరూంలో పనిచేసే సిబ్బందే.. ఆ షోరూంలోని టీవీలను మాయం చేశారు. ఈ సంఘటన విజయవాడ నగరంలోని బందర్ రోడ్డులో చోటుచేసుకుంది.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరనే సామేత ఉంది. కానీ ఇక్కడ ఆ సామేత రివర్స్ అయ్యింది. ఓ టీవీ షోరూంలో జరిగిన అవకతవకలను వెంటనే గుర్తించారు. టీవీ షోరూంలో పనిచేసే సిబ్బందే.. ఆ షోరూంలోని టీవీలను మాయం చేశారు. ఈ సంఘటన విజయవాడ నగరంలోని బందర్ రోడ్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బందర్ రోడ్డులో ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూం ఉంది. షోరూంకి వచ్చే వినియోగదారులకు టీవీలు అమ్మాల్సిన సిబ్బంది.. వాటిని అడ్డదారిలో మాయం చేశారు.
సమారు రూ.కోటి విలువచేసే టీవీల అమ్మకాలలో అవకతవకలు చేశారు. ఎల్ఈడీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాల్లో పెద్ద కుంభకోణమే చేశారు. విషయాన్ని గ్రహించిన యాజమాని.. పోలీసులను ఆశ్రయించాడు. ఆ షోరూం మేనేజర్ తోపాటు నలుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. షోరూం ఉద్యోగులకే అవకతవలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..షోరూం లోని ఉద్యోగులందరినీ ప్రశ్నిస్తున్నారు.
