Asianet News TeluguAsianet News Telugu

రూ.10 కాయిన్ తీసుకోలేదని కోర్టుకెళ్లి గెలిచారు

ఆర్ బీ ఐ చెప్పాక ఇంకేముంది అనుకొని తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ఓ డెయిరీ ఫాం ఏకమొత్తంగా రూ. 34 లక్షల విలువ చేసే రూ. 10 కాయిన్ లను యాక్సిస్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్లింది.

rs 10 coin dispute settled in court

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిశాకా దేశమంతా మరో ప్రశ్నకు జవాబు కోసం ఎదురు చూస్తోంది.

 

అదే 10 రూపాయిల కాయిన్ చెల్లుతుందా... లేదా...?  అని..

 

ఎవరైనా రూ. 10 కాయిన్ తీసుకోకపోతే నేరంగానే పరిగణిస్తామని  ఆర్ బీఐ చాలా స్పష్టంగా పేర్కొంది. రూ. 10 కాయిన్ చెల్లుతుందని ప్రకటనలమీద ప్రకటనలిచ్చింది.

 

ఆర్ బీ ఐ చెప్పాక ఇంకేముంది అనుకొని తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ఓ డెయిరీ ఫాం ఏకమొత్తంగా రూ. 34 లక్షల విలువ చేసే రూ. 10 కాయిన్ లను యాక్సిస్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్లింది.

 

అయితే ఆ బ్యాంకు వాళ్లు రూ. 10 కాయిన్ లను తీసుకోడానికి నిరాకరించారట.

 

ఆర్ బీఐ చెప్పాక కూడా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే... వాళ్లు మాత్రం చెల్లకపోవడం వల్ల తీసుకోవడం లేదు... అన్ని కాయిన్ లను బ్యాంకులో పెట్టడానికి స్థలం సరిపోవడం లేదు. అందుకే వాటిని తీసుకోవడం లేదని వివరణ ఇచ్చారు.

 

అయితే డెయిరీ సంస్థ నిర్వహకులు మాత్రం గతంలో బ్యాంకు వాళ్లు ఎన్ని కాయిన్స్ ఇచ్చిన తీసుకున్నారని, రూ. 10 కాయిన్ చెల్లుబాటుపై పుకార్లు వచ్చిన తర్వాత వాళ్లు ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.

 

అంతేకాదు ఈ విషయం కోర్టులోనే తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. మద్రాసు హై కోర్టు కూడా డెయిరీ వాదనతో ఏకీభవించింది. యాక్సిస్ బ్యాంకు కచ్చితంగా వారిచ్చిన అన్ని రూ. 10 కాయిన్ లను తీసుకోవాల్సిందేనని తీర్పునిచ్చింది.

 

అయితే బ్యాంకు వాళ్లు మాత్రం ఓ లక్ష రూపాయిల వరకు మాత్రమే రూ. 10 కాయిన్ లు తీసుకున్నారు. మిగిలిన కాయిన్స్ తీసుకోడానికి అభ్యంతరం లేదని అయితే తమ బ్యాంకులో స్థలం లేదని అందుకే తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios