రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి రెండు సరికొత్త బైక్స్
ప్రముఖ లక్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్.. మరో రెండు సరికొత్త బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. థండర్ బర్డ్ 350ఎక్స్, థండర్ బర్డ్ 500ఎక్స్ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. థండర్ బర్డ్ 350ఎక్స్ ప్రారంభ ధర రూ. 1.56 లక్షలు (ఎక్స్-షోరూమ్), 500 ఎక్స్ ప్రారంభ ధర రూ. 1.98 లక్షలుగా ప్రకటించారు. కొత్త కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ తో యువ బైకర్లే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. రెండింటిలోనూ డే టైం ఎల్‌ఈడీ లైట్లను, ఇంటిగ్రెటెడ్ హెడ్ ల్యాంప్, ఎల్‌ఈడీ టైయిల్ ల్యాంప్‌ను అమర్చింది. ఈ బైకులు బ్లూ, ఆరెంజ్ సహా నాలుగులు రంగుల్లో లభ్యం కానున్నాయి.
థండర్ బర్డ్ 350ఎక్స్ బైక్ లో 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ని అమర్చారు. దీనిలో 5స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఇక థండర్ బర్డ్ 500 ఎక్స్ బైక్ లో 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీనికి కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
