15 రాయల్ ఎన్ ఫీల్డ్ స్టెల్త్ బ్లాక్ క్లాసిక్  500 మోటార్ సైకిళ్లు  15 సెకండ్లలో అమ్ముడు పోయాయి. ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది.  లిమిటెడ్ ఎడిషన్ గా కంపెనీ 15 మోటార్ సైకిళ్ల విక్రయాన్ని ఆన్ లైన్ లో ఉంచింది. అంతే, హాట్ కేక్స్ లాగా అక్షరాల 15 సెకన్లలో అమ్ముడుపోయాని కంపెనీ ప్రకటించింది. ఈ రకం మోటార్ సైకిళ్లను బ్రేవ్ హార్ట్ ఎన్ ఎస్ జి కమాండోలు వాడుతుంటారు. ఈమధ్య ఈ వాహానాల మీద కమాండోలు 8000 కి.మీ జర్నీ ఆఫ్ డిటర్మినేషన్ చేపట్టారు. దేశ ఐక్యత కోసం ఈ యాత్ర చేపట్టారు. దీనితో ఈ వాహనాలకు క్రేజ్ పెరిగింది. నిజానికి మద్రాసు (చెన్నై) కు చెందిన రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలు 1955 నుంచే సైన్యానికి సేవలందిస్తున్నాయి.భారత సైనికుడికున్న దృఢత్వంతో ఈ వాహానాలను పోలుస్తుంటారు. దేశానికి 33 సంవత్సరాల సేవలు పూర్తి చేసిన సందర్భంగా ఎన్ ఎస్ జి బ్రేవ్ హార్ట్స్ ఈ యాత్రకు ఉపక్రమించారు.

ఇక వాహన విషయానికొస్తే, డిసెంబర్ 13 న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలయింది.  ధర రు. 1,90,000, ఆన్ లైన్ బుకింగ్ చార్జ్ రు.15,000. అంతే, 18  సెకండ్ల లోనే ఈ వాహనాలు అమ్ముడు పోయాయి.

ఈ మధ్య ఎన్ ఫీల్డ్ కుర్రకారు కలల గుర్రం అయిపోయింది.  ఎన్ ఫీల్డ్ ఇపుడిపుడే మాస్కులైనిటీ సింబల్ అయిపోతాఉంది. మెల్లిగా ఈ తరం లైట్ స్లీక్ జపాన్ వెహికిల్స్ నుంచి గాడీ, దృఢత్వం, వేగం, ఇంపైన సౌండ్... ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ వైపు మరలుతున్నారు.అదీ చేంజ్ బాస్.