ఎలక్ట్రిక్ ఇంజిన్ తో వాహనాన్ని తయారుచేసిన రాయల్ ఎన్ ఫీల్డ్
పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ ఇంజన్ తయారీపై ఇప్పుడు అన్ని కంపెనీలు దృష్టిపెడుతున్నాయి. భవిష్యత్తులో అన్ని కంపెనీలు తమ వాహనాలకు ఎలక్ట్రిక్ ఇంజిన్ లు తీసుకువస్తాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. కాగా.. ఈ విషయంలో రాయల్ ఎన్ ఫీల్డ్ ముందడుగు వేసింది. రాయల్ ఎన్ ఫీల్డ్ 500 వాహనానికి ఎలక్ట్రిక్ ఇంజన్ ని ఏర్పాటు చేసింది. అలా ఎలక్ట్రిక్ ఇంజన్ ఏర్పాటు చేసిన వాహనాన్ని బ్యాంకాంక్ లో విడుదల చేసింది.
కొద్ది రోజుల క్రితం రాయల్ ఎన్ ఫీల్డ్ 500 క్లాసిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే వాహనానికి ఎలక్ట్రిక్ ఇంజన్ ఏర్పాటు చేసి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ప్రదర్శనకు ఉంచారు. ఇది స్టాండర్ఢ్ బైక్ కన్నా వేగంగా నడుస్తుంది. తొలిసారి రాయల్ ఎన్ ఫీల్డ్ తమ మోటారు సైకిల్ వాహనాన్ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చింది. గతంలో ఒక వ్యక్తి రాయల్ ఎన్ ఫీల్డ్ మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి దానిని స్వతహాగా ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకున్నాడు. ఈ ఘటన లండన్ లో జరిగింది.
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను డిమాండ్ పెరిగే అవకాశం ఉందని.. తాము కూడా ఆ దిశగా చర్యలు చేపడతామని రాయల్ ఎన్ ఫీల్డ్ కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ తెలిపారు. వచ్చే నూతన సంవత్సరంలో కాంటినెంటల్ జీటీ, ఇంటర్ సెప్టర్ 650 పేరిట కొత్త వాహనాలను విడుదల చేస్తామని ప్రకటించారు.
