రోహిత్ శర్య భార్యపై విరుచుకుపడుతున్న ధోని అభిమానులు

First Published 8, Apr 2018, 11:34 AM IST
Rohit Sharma’s wife Ritika Sajdeh trolled by MS Dhoni fans for calling MI skipper ‘captain cool’
Highlights
వివాదానికి దారి తీసిన ‘ మిష్టర్ కూల్’

ఐపీల్ 2018 సందడి మొదలైంది.  ఈ సీజన్ లో  తొలి మ్యాచ్  ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అలా అయిపోయిందో లేదో.. ఇలా వివాదం మొదలైంది. ధోని అభిమానులు రోహిత్ భార్య పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
 

 

🔥 🔥 🔥 🔥 @rohitsharma45 @gqindia

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on

ఏకంగా రోహిత్‌శర్మ భార్య రితికా సజ్దేను టార్గెట్‌ చేస్తూ ధోని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. దీనికి కారణం రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌. ఈ పోస్ట్‌ ధోని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే.. ఓ మ్యాగజైన్‌పై రోహిత్‌ శర్మ కెప్టెన్‌ కూల్‌ అని ఉన్న ఫొటో.  అది సంగతి కెప్టెన్‌ కూల్‌ అంటే ధోని ఒక్కడే అర్హుడని ఆయన అభిమానుల వాదన. ఇంకేముంది సోషల్‌ మీడియా వేదికగా రితికాను నిలదీసారు. కొందరు మర్యాద పూర్వకంగా ఆ ట్యాగ్‌ ధోనిది దయచేసి రోహిత్‌కు ఇవ్వద్దని విజ్ఞప్తి చేయగా..మరి కొందరు.. ‘రితికా ఆ ట్యాగ్‌ కోసం అడుక్కోకు!’ అని సెటైర్‌ వేశారు. ప్రపంచంలో కూల్‌ కెప్టెన్‌ అంటే ధోనినే మరేవరు కాదని ఇంకొందరు కామెంట్‌ చేశారు.

అయితే రోహిత్‌ అభిమానులు మాత్రం రోహిత్‌ కూల్‌ కెప్టెనేనని అంగీకరిస్తున్నారు. ముంబైని మూడు సార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లోనే విజయవంతమైన కెప్టెన్‌ అని అతని అభిమానులు ప్రతి వాదనకు దిగారు. రోహిత్‌ కెప్టెన్సీ ప్రశాంతంగా చేస్తాడని కూల్‌ కెప్టెన్సీ విషయంలో తప్పులేదని రోహిత్‌ భార్యకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కామెంట్స్‌పై రితికా సజ్దే మాత్రం స్పందించలేదు.

loader