ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ పేరు చెప్పగానే.. దాదాపు అందరికీ  వన్డేల్లో అతను చేసిన మూడు సార్లు డబుల్ సెంచరీలే గుర్తుకువస్తాయి. వన్డే మ్యాచ్ లలోనే రోహిత్ అంతటి అద్భుతమైన ప్రదర్శన కనిపించి రికార్డ్ క్రియేట్ చేశాడు. తాజాగా ఆయన జాబితాలోకి మరో రికార్డ్ వచ్చి చేరింది. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీలు ఉత్తమమైన రికార్డ్ అయితే.. టీ 20ల్లో చెత్త రికార్డును దక్కించుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన టీ20లో ఎదుర్కొన్న తొలి బంతికే రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. దీంతో భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ మొదటి స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు మొత్తం నాలుగు సార్లు రోహిత్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా మైదానం నుంచి బయటకు వచ్చాడు. రోహిత్‌ తర్వాత స్థానాల్లో యూసుఫ్‌ పఠాన్‌(3), ఆశిష్‌ నెహ్రా(3) ఉన్నారు.