Asianet News TeluguAsianet News Telugu

పరీక్షల్లో నెగ్గిన ఖర్బుజా.. ప్రశాంతంగా తినండి

  • ఖర్బుజా తిని ఆస్ట్రేలియాలో నలుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే
Rock melons released for sale after clearing tests

ఖర్బుజా పండు తినడం వలన లిస్టీరియా అనే వ్యాధి సోకుతోందని.. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా నలుగురు మృతి చెందారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఆ ఖంగారు అవసరం లేదు. ఎందుకంటే.. ఖర్బుజా పండ్లకు పరీక్షలు జరిపారు. ఆ పండులో లిస్టీరియా వైరస్ లేదని తేలింది. దీంతో.. తిరిగి ఆ పండ్లను మార్కెట్లోకి వదులుతున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఆస్ట్రేలియాలో ఖర్బుజా పండు తిని నలుగురు మృతి చెందారు. కేవలం ఖర్బుజా పండు తినడం వల్లే వాళ్లు మృతి చెందారు. ఆ ఖర్బుజా పండ్లలో లిస్టీరియా అనే వైరస్ ఉండటం వల్లే వారు చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. నలుగురు మృతిచెందడంతోపాటు మరో 15మంది ఈ పండు తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పిల్లలు, వృద్ధులు, గర్బిణీలు ఈ ఖర్బుజా పండు తినవద్దని సూచిస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన ఖర్బుజా పండ్లను అందరూ తిప్పి వెనక్కి పంపించేశారు.

కేవలం ఆస్ట్రేలియాలోనే మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా ఈ పండ్ల విషయంలో అప్రమత్తమయ్యారు. చాలా మంది ఖర్బుజా కొనడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో.. అధికారులు ఈ పండ్లపై టెస్టులు నిర్వహించారు. లిస్టీరియా లేదని తేల్చి చెప్పారు. ఎలాంటి భయం లేకుండా  తినవచ్చని తేల్చిచెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios