వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఇంట్లో చోరీ జరిగింది. మణికొండలోని పంచవీటి కాలనీలోని రోజా ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ కి పాల్పడ్డారు. సుమారు రూ.10లక్షలు విలువచేసే బంగారం, డైమండ్ ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోజా భర్త సెల్వమణి తమిళనాటు ప్రముఖ సినీ దర్శకుడు కావడంతో వారు కొంతకాలం హైదరాబాద్ లో, మరికొంతకాలం చెన్నైలో గడిపేవారు. కాగా.. రోజా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. కొద్ది కాలంగా హైదరాబాద్ కి రావడం లేదు. చాలా రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో దానిని దొంగలు అవకాశంగా చేసుకున్నారు. అదునుచూసుకొని చోరీకి పాల్పడ్డారు. చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.