మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

First Published 26, Nov 2017, 12:09 PM IST
Road accident in Medak district
Highlights
  • మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
  • ఇద్దరు మృతి
  • ఏడుపాయలకు వెళుతుండగా ప్రమాదం

 

దైవ దర్శనానికి వెళుతున్న ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి గురైన విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 


వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ కు చెందిన ఓ కుటుంబం వనదుర్గా మాత దర్శనం కోసం మెదక్ జిల్లా లోని ఏడుపాయలకు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్నమినీ బస్సు మనోహరాబాద్ మండలం కుంచారం గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వేగంగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది.  దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు మరో మహిళ కృష్ణవేణి   మృతి చెందారు. ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలవగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  

loader