సినిమా నడవక పోవడంతో అసంతృప్తి నిర్లక్షమే కారణం అన్న రిషి కపూర్. 

రణ్‌బీర్‌ కపూర్ నూత‌న చిత్రం జగ్గా జాసూస్. విడుద‌ల అయిన మొద‌టి రోజు నుండి ప్లాప్ టాక్ ను ముట‌గ‌ట్టుకుంది. దీనితో బాగా హార్ట్ అయిన తండ్రి రిషీక‌పూర్‌ దర్శకుడు అనురాగ్‌ బసును పై ఫైర్‌ అయ్యారు. సినిమా మాద్య‌మం లో ప‌ని చేస్తున్న‌ప్పుడు స‌మ‌య పాల‌న చాలా ముఖ్య‌మ‌ని అనురాగ్‌ బసుకు అది లేద‌ని విమ‌ర్శించారు. అనురాగ్ బ‌సుకు బాధ్యతారాహిత్యం ఎక్కువ అని, అతను సినిమాను అనుకున్న సమయానికల్లా విడుదల చేయలేకపోయాడని, అందుకే సినిమా అస్స‌ట అస్స‌లు ఆడ‌లేద‌ని అన్నారు. డైరెక్ట‌ర్ అనురాగ్ బ‌సుతో పాటు సంగీత దర్శకుడు ప్రీతంపై కూడా ఆయన మండిపడ్డారు. ఆయన సరిగ్గా మ్యూజిక్‌ అందించలేదని విమర్శించారు.

రణ్‌బీర్‌ కపూర్‌-కత్రినాకైఫ్‌ జోడీగా సిద్దార్థ్ రాయ్ నిర్మాత‌గా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన జగ్గాజాసూస్‌ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోని సంగతి తెలిసిందే. రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలి వీకెండ్ కేవ‌లం 40 కోట్లు మాత్ర‌మే వసూలు చేసింది. రెండోవారాంతానికి ఈ రేటు మ‌రింత త‌గ్గిపోయింది. చాలా వ‌ర‌కు థియేటర్లు వెలవెలబోతున్నాయి.