మోదీ ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది..

మోదీ ఆరోగ్య రహస్యం తెలిసిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ ఇంచుమించు ఏడుపదుల వయసుకు దగ్గరలో ఉన్నారు. అయినా.. ఆ వయసు చాయలు ఆయనలో ఏ కోసానా కనిపించవు. అంతేకాదు ఆయన దాదాపు ఒక రోజులో 16 నుంచి 18గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా వర్క్ చేస్తుంటారు. ఆ అలసట కూడా ఆయన ముఖంలో కనపడవు. అందుకు కారణమేంటో ఇప్పుడు తెలిసింది. ఆయన తీసుకునే ఆహారం కారణంగానే ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

మోదీ తనను తాను ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి మష్రూమ్స్ తింటారట. మనం రెగ్యులర్ గా చూసే మష్రూమ్స్ కావవి. మోదీ తినే మష్రూమ్స్ కేవలం హిమాచల్ రాష్ట్రంలో మాత్రమే లభిస్తాయి. వాటి విలువ ఎంతో తెలుసా..? కేజీ రూ.30వేలు. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ జాతీయ సెక్రటరీగా ఉన్న నాటి నుంచి మోదీ వీటిని ఆహారంగా తీసుకుంటున్నారట.  ఈ విషయాన్ని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయంలో మీడియా ప్రతినిధులకు స్వయంగా వెల్లడించారు.

‘ హిమాచల్ ప్రదేశ్ లో లభించే మష్రూమ్స్ తింటుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. ఆ మష్రూమ్స్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి’ అని మోదీ మీడియా ప్రతినిదులకు చెప్పారు. ఈ మష్రూమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ. హిమాచల్ ప్రదేశ్ లోని చాలా గ్రామాలకు ఆదాయం ఈ మష్రూమ్స్ నుంచే వస్తోంది. ప్రతి సంవత్సరం మార్చి నెల నుంచి మే నెల వరకు ఈ మష్రూమ్స్ లభిస్తాయి. వీటిని అమ్మే ముందు ఎండపెట్టి మరీ అమ్ముతారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page