Asianet News TeluguAsianet News Telugu

కాప్రా భూకుంభకోణంలోకి కేటీఆర్, వినోద్ లను గుంజిన రేవంత్

సంచలన కామెంట్స్ చేసిన రేవంత్
revanth reddy fires on ktr and mp vinod

కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అధికార పార్టీకి చెందిన కొందరు బడా నేతలతో పాటు ఓ రియల్టర్ కుమ్మకై ఈ భూములను కబ్జా చేశారని మండిపడ్డారు.దాదాపు 1000 కోట్ల విలువైన భూమిని రియల్టర్ కు అప్పగించి ప్రభుత్వ పెద్దలు కుంభకోణానికి సహకరించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంతకు ఈ భూమిని కాజేసిన ఆ రాజకీయ నాయకులు, రియల్టర్ ఎవరో తెలుసుకోవాలంటే కింది స్టోరీని చదవండి.

తెలంగాణ ప్రభుత్వ కనుసన్నల్లోనే తెలంగాణలో అనేక ప్రాంతాల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా కాప్రాలో వెయ్యి కోట్ల భూ స్కామ్ జరిగిందని, ఇందులో సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, ఎంపి వినోద్, మై హోమ్ అధినేత రామేశ్వరరావు హస్తం ఉందని రేవంత్ వెల్లడించారు. దేశవిభజన సమయంలో రహీమ్ భక్షి అనే వ్యక్తి తన భూములను వదిలేసి పాకిస్తాన్ వెళ్లిపోయాడని ఆ భూములనే ఇపుడు ప్రభుత్వ పెద్దలు రామేశ్వరరావు అప్పగించి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు రేవంత్.  ఈ భూమిని 2011 లో సుప్రీం కోర్ట్ అవాక్యు ప్రాపర్టీ అని స్పష్టంగా తేల్చిందన్నారు. సుప్రీం చెప్పిన తర్వాత ప్రభుత్వ ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ప్రభుత్వ భూమి అని రికార్డ్స్ ఉండగా ..జూపల్లి రామేశ్వర్ రావు 20 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.

పురపాలక మంత్రి కేటీఆర్ స్వంత శాఖ లో ఈ తతంగం జరుగుతుంటే ఆయన పట్టించుకోవడం లేదంటే ఆయనకు ఇందులో బాగమున్నట్లేనని స్పష్టమవుతోందని రేవంత్ తెలిపారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటె అక్కడ జరుగుతున్న అమ్మకాలను అడ్డుకోవాలన్నారు. ఈ భూమికి సంబందించిన సమాచారాన్ని కేటీఆర్ ఇచ్చేనందుకు తాను రెడీగా ఉన్నట్లు రేవంత్ తెలిపారు. ప్రభుత్వం భూమిని రామేశ్వరావ్ ఇలా అప్పనంగా దోచుకుంటుంటే చూస్తూ ఉరుకోమని, ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కేటీఆర్ తో కలిసి ఆ భూమి పరిశీలనకు వెళ్లేందుకు కూడా తాను సిద్దంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios