ఏమి కొనక్కర్లేదు.. అన్నీ అద్దెకు లభిస్తాయి..!

rent furniture home appliances bikes and more in rentomojo
Highlights

  • రెంటో మోజో.కామ్  వెబ్ సైట్ లో మనకు ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువును అద్దెకు తెచ్చుకోవచ్చు
  • రెంటోమోజో ఆ వస్తువుల విలువ ఆధారంగా అద్దెను ఖరారు చేస్తుంది.

 

ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేసే చాలా మందికి ఎప్పుడు ఏ ప్రాంతానికి బదిలీ చేస్తారో తెలీదు. కొన్ని కంపెనీలు మినహా.. చాలా వరకు కంపెనీలు.. ఉద్యోగులను ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్  ఫర్ చేస్తూ ఉంటాయి. అలాంటి వారు.. బదిలీ అయిన ప్రతీసారి.. తమ ఇంట్లోని సామన్లను వెంట పెట్టుకొని వెళ్లాల్సిందే. అందుకు ఖర్చు కూడా అవుతుంది. సరే సామన్లన్నీ వదిలేసి వెళదామా అంటే.. ఇప్పుడు వెళ్లిన ఇంట్లోకి కావాలి కదా.. దీంతో చచ్చినట్టు వాటిని తీసుకొని వెళతారు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యే.ఇక నుంచి ఈ సమస్య ఉండదు అంటోంది.. రెంటో మోజో. కామ్ వెబ్ సైట్.

 

వివరాల్లోకి వెళితే..ఈ రెంటో మోజో.కామ్  వెబ్ సైట్ లో మనకు ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువును అద్దెకు తెచ్చుకోవచ్చు. అవసరం తీరాక.. తిరిగి ఇచ్చేయచ్చు.  

ఉద్యోగం, చదువు, సంసారం కోసం కొద్ది కాలం ఒక ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు అవసరమైన వస్తువులను అద్దెకిచ్చే మార్కెట్లో ఆ వస్తువు విలువతోపాటు మనం ఎంత కాలం అద్దెకు తీసుకుంటామో (ఒక అంచనా)తో దానిని బట్టి ఆ అద్దె నిర్ణయిస్తారు. వాడుకున్న తర్వాతనే అద్దె చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం ముందు చెల్లించాలి. ఇది వస్తువు విలువను బట్టి నిర్ణయిస్తారు. అద్దెకు తీసుకున్న వస్తువులను తిరిగిచ్చిన తర్వాత 100 శాతం సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగిస్తారు. ఒక వేళ ఏదయినా కారణంగా ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే తక్షణమే ఒప్పందాన్ని రద్దు చేసుకుని వస్తువుల్ని తిరిగి ఇచ్చే వీలుంది.

కేవలం ఇంట్లో వస్తువులే కాదు.. బైక్స్ లాంటివి కూడా అద్దెకు ఇస్తారు. అన్ని రకాల కంపెనీల ద్విచక్రవాహనాలు లభిస్తాయి. దీంతో.. వాటిని కూడా ఇళ్లు మారిన ప్రతిసారీ తీసుకొని వెళ్లనవసరం లేదు.

ఈ విధానం చాలా వినూత్నంగా ఉండి అందరికీ నచ్చేలా ఉంది కదూ.

loader