పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత నోయిడాలో తుదిశ్వాస విడిచారు
ప్రముఖ అంతరిక్ష రంగ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత యశ్‌పాల్(90) కన్నుమూశారు. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం నోయిడాలో తుదిశ్వాస విడిచారు.
ప్రపంచంలోనే తొలిసారిగా 1970లో కేబుల్, సాటిలైట్ బ్రాడ్ కాస్టింగ్ విధానాన్ని ఏర్పాటు చేయగా.. దాని ఏర్పాటుకి యశ్ కీలకపాత్ర పోషించారు.ఆయన భౌతికశాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీకి ఛాన్స్ లర్‌గా వ్యవహరించారు.
ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పాల్‌ని 1976లో పద్మభూషణ్‌తో, 2013లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
సోమవారం భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ అధ్యక్షుడు ఆచార్య ఉడుపి రామచంద్రరావు (యు.ఆర్.రావు) చనిపోయిన సంగతి తెలిసిందే.
