సీఎం ఫొటోను తొలగించి సన్నీ యాడ్ వేసిన గోవా ప్రభుత్వ బస్సులు

రాంగోపాల్ వర్మ సన్నీలియోన్ ను తెగ పొగుడుతుంటే గోవాలో మాత్రం తెగ తిట్టేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ఆద్వర్యంలో నడిచే కదంబ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ లిమిటెడ్ ( కేటీసీఎల్) చేసిన పని ఇప్పుడు రాష్ట్రలో పెద్ద వివాదంగా మారింది. స్వయంగా గోవా కమిషన్ ఫర్ ఉమెన్ ఈ ఘటనలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఇంతకీ విషయం ఏంటంటే...

ఓ కండోమ్ కంపెనీ సన్నీలియోన్ తో ప్రకటన రూపొందించింది. దాన్ని గోవాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేటీసీఎల్ బస్సులో ప్రసారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కేటీసీఎల్ బస్సులో ఎన్నికల ముందు వరకు సీఎం ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు ప్రసారం చేసేవారు.

బస్సులపై సీఎం ఫొటోతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను హొర్డింగులకు పెట్టేవారు. ఎలక్షన్ ల నేపథ్యంలో కేటీసీఎల్ బస్సులో సీఎం ఫొటోను తొలగించారు. ప్రభుత్వ ప్రచార వీడియో కార్యక్రమాలను నిలిపేశారు. వాటి స్థానంలో సన్నీ కండోమ్ యాడ్ ను ప్రచారం చేస్తూ వచ్చారు. దీనిపై గోవాకు చెందిన ఓ స్వచ్చంధ సంస్థ వుమెన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

దీంతో వెంటనే స్పందిచిన వుమెన్స్ కమిషన్ కేటీసీఎల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. వెంటనే ఆ యాడ్ లు తొలగించాలని ఆదేశించింది.

అయితే దీనిపై కేటీసీఎల్ యాజమాన్యం వివరణ ఇస్తూ... మత్తు పదార్థాలు, పొగాకు సంబంధిత ప్రకటనలు జారీ చేయరాదని తమకు ప్రభుత్వం సూచించింది కానీ, కండోమ్ యాడ్ లను ప్రసారం చేయోద్దని చెప్పలదేని పేర్కొంది. తమకు వచ్చిన యాడ్ ఓ ముంబై ఏజెన్సీదని, వారికి దీనిపై నోటీసులు జారీ చేసి యాడ్ తొలగింపునకు చర్య తీసుకుంటామని తెలిపింది.