వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..

First Published 2, Apr 2018, 1:01 PM IST
Relief for consumers: LPG cylinder rates slashed
Highlights
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

వంట గ్యాస్ వినియోగదారులకు నిజంగా ఇది శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరల భారంతో కుంగిపోతున్న సామాన్యుడికి కాస్త ఊరట కలిగించే వార్త ఇది. ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.35.50 మేర తగ్గించాయి. నెల రోజుల్లో సిలిండర్ ధర తగ్గడం ఇది రెండోసారి. అయితే ఈసారి కమర్షియల్ సిలిండర్ల ధర కూడా తగ్గించారు. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.54 తగ్గగా.. 5 కిలోల సిలిండర్ ధర రూ.15 తగ్గింది. ప్రస్తుతం ఏడాదికి ప్రతి ఇంటికీ 12 సబ్సిడీ సిలిండర్లను ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతి సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనాల్సిందే. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2020 కల్లా కొత్తగా మరో 3 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

loader