టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం గురించి అందరికీ తెలిసిందే. ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ ధరకే మొబైల్ డేటా అందించి.. ఇతర టెలికాం ఆపరేటర్లకు దడ పుట్టించింది. కాగా.. తాజాగా జియో ఫై వైఫై హాట్ స్పాట్ పై కూడా ఆఫర్ల బొనాంజా ప్రకటించింది. కేవలం రూ.1,999 విలువ చేసే జియో ఫై హాట్ స్పాట్ ని కొనుగోలు చేస్తే చాలు.. రూ.3,595 విలువ గల ప్రయోజనాలు వినియోగదారులకు అందనున్నాయి.

జియో ఫై వైఫై హాట్ స్పాట్ కొన్నవారికి రూ.1295 విలువ గల ఉచితంగా మొబైల్ డేటా లభిస్తుంది. అంతేకాకుండా రూ.2,300 విలువ చేసే ఓచర్లు కూడా లభిస్తాయి. ఈ ఓచర్లను పేటీఎం, రిలయన్స్ డిజిటల్ లలో రిడిమ్ చేసుకోవచ్చు.  ఈ ఓచర్ల వివరాలు మై జియో ఆప్ లో పొందుపరిచారు. మొత్తం ఓచర్లలో పేటీఎం నుండి 800 రూపాయల విలువైన క్యాష్ బ్యాక్ ఓచర్, 500 రూపాయల విలువైన ఏజియో ఓచర్, 1,000 రూపాయల విలువైన మరో ఓచర్ (ఇది రిలియన్స్ డిజిటల్ లో కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది) అందిస్తున్నారు.

ఇక మొబైల్ డేటా విషయానికి వస్తే.. రూ.1295 విలువచేసే 336 జీబీ డేటాని ఉచితంగా అందిస్తోంది. ఈ డేటా 8నెలల పాటు రోజుకి 1.5జీబీ చొప్పున ఉపయోగించుకోవచ్చు. రోజుకి 2జీబీ డేటా కావాలి అనుకుంటే.. ఈ ఆఫర్ 6నెలలు మాత్రమే వర్తిస్తుంది. అలా కాదు.. రోజుకి 3జీబీ డేటా కావాలి అనుకుంటే.. ఈ ఆఫర్ నాలుగు నెలలు వర్తిస్తుంది. వీటిలో.. దేనినైనా ఎంచుకోవచ్చు.