వెరిఫికేషన్ చేయని సిమ్ లు వాడుతున్న కస్టమర్లకు హెచ్చరికలు

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఇప్పుడు తన ఖాతాదారులకు సడెన్ షాక్ ఇస్తోంది.ఉచిత ఆఫర్లతో దాదాపు 10 కోట్ల మంది ఖాతాదారులను తన వైపు తిప్పుకున్న జియో ప్రస్తుతం తమ ఖాతాదారులందరి వివరాలను సమగ్రంగా పరిశీలించే పని చేపట్టింది.

అందుకే ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా లేని సిమ్ లను బ్లాక్ చేసేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కస్టమర్లకు మెసేజ్ లు వస్తున్నాయి.

సిమ్ కార్డు తీసుకునే సమయంలో ఆధార్ కార్డు సమర్పించిన వారు, థంబ్ ఇంప్రెషన్ ఇవ్వని వారు అంటే వెరిఫికేషన్ కాకుండా ఇచ్చిన సిమ్‌లను బ్లాక్ చేయనుంది.

అలాగే ఇ-కేవైసీ సమర్పించని కస్టమర్లకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది.

అయితే మీ సిమ్ బ్లాక్ కాకుండా ఉండాలంటే మీ జియో సిమ్ నుంచి 1977 నంబర్‌కు కాల్‌ చేయాలి. అలా టెలీ వెరిఫికేషన్‌తో మీ సిమ్ బ్లాక్ కాకుండా చూసుకోవచ్చు.