జియో మరో సంచలనం

First Published 11, May 2018, 3:54 PM IST
Reliance Jio’s New Rs 199 Plan To Erode Rivals’ Revenue, Brokerages Say
Highlights

మరో సరికొత్త ఆఫర్ ని ప్రవేశపెట్టిన జియో

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరో  సంచలనానికి తెర లేపింది.  ఇప్పటి వరకు కేవలం ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం మాత్రమే ఆఫర్లు ప్రకటించిన జియో.. తాజాగా పోస్ట్ పెయిడ్ కష్టమర్ల కోసం కూడా ఓ సరికొత్త  ఆఫర్ ని తీసుకువచ్చింది. 

తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం రూ.199 ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ నెల 15 నుంచి ఈ ప్లాన్ అమ్మకాలు మొదలవనుండగా, జీరో-టచ్ పేరుతో వచ్చిన ఇందులో కస్టమర్లకు నెలకు 25జీబీ డాటాతోపాటు అంతర్జాతీయ కాలింగ్, రోమింగ్ ప్రయోజనాలు అందనున్నాయి. 

ఈ ప్లాన్‌లో అమెరికా, కెనడా కాల్స్‌కు నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున చార్జ్ చేస్తున్న జియో.. బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజీలాండ్, సింగపూర్, బ్రిటన్‌లకు రూ.2, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీలకు రూ.3, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్తాన్, థాయిలాండ్‌లకు రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాంలకు రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌లకు రూ.6 చొప్పున తీసుకుంటున్నది. 

ఇదిలావుంటే ఒకరోజు కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్ (భారత్‌తోపాటు విదేశాల్లో లోకల్ కాల్స్), ఎస్‌ఎమ్‌ఎస్, 250ఎంబీ హై-స్పీడ్ డాటా సౌకర్యం పొందాలంటే రూ.575 చెల్లించాలన్న జియో.. ఇదే 7 రోజులకు రూ.2,875, 30 రోజులకు రూ.5,751 ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే 30 రోజుల ప్లాన్‌లో రోజుకు 5జీబీ డాటా వస్తుందని చెప్పింది. అంతర్జాతీయ రోమింగ్‌ను కూడా రెండు టారీఫ్‌లలో అందుబాటులోకి తెచ్చిన జియో.. ఒక టారీఫ్‌లో వాయిస్ కాల్స్ నిమిషానికి రూ.2, మొబైల్ డాటా ఎంబీకి రూ.2, ఒక్కో మేసేజ్‌కి రూ.2 చొప్పున చార్జ్ చేస్తామని వివరించింది. మరో టారీఫ్‌లో వీటికి రూ.10 చొప్పున తీసుకుంటామని స్పష్టం చేసింది.

loader