అతి తక్కవ ధరలో జియో.. ఆండ్రాయిడ్ ఫోన్

First Published 31, Jan 2018, 12:53 PM IST
Reliance Jio Partners MediaTek to Make Android Oreo Smartphone
Highlights
  • మరో సంచలనానికి సిద్ధమైన జియో
  • జియో నుంచి స్మార్ట్ ఫోన్
  • త్వరలోనే భారత మార్కెట్ లోకి

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ ని విడుదల చేయనుంది.  జియో సిమ్ విడుదల చేసి టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ సంస్థ.. కొంత కాలం క్రితం జియో ఫీచర్ ఫోన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అది కూడా అతి తక్కువ ధరకి  ఫోన్ అందించడంతో.. దానిని కొనుగోలు చేసేందుకు దేశవ్యాప్తంగా ఆసక్తి చూపించారు. కాగా.. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ని విడుదలచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ మేరకు జియో  మీడియాటెక్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో త్వరలో విడుదల చేయనున్న నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్ ‘‘లైఫ్ బ్రాండ్’’ పేరిట యూజర్లకు లభ్యం కానుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌ను అందివ్వనున్నారు.  ఈ ఫోన్ లో 512 ఎంబీ లేదా 1జీబీ ర్యామ్ ఉండవచ్చని తెలిసింది. ఈ ఫోన్ ధర కూడా రూ.2వేల లోపే ఉండనుందని సమాచారం. జియో నుంచి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ విడుదలైతే.. అత్యంత తక్కువ ధర స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది.

loader