భారీ స్థాయిలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన జియో

భారీ స్థాయిలో ఉద్యోగాలు ఆఫర్ చేసిన జియో

టెలికాం రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి సంచలనాలు సృష్టిస్తున్న జియో.. ఇప్పుడు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆకర్షిస్తోంది. తాజాగా జియో.కామ్ వెబ్ సైట్ ఈ మేరకు ఓ ప్రకటన కూడా ప్రచురించింది. ఆ ప్రకటన  సమాచారం ప్రకారం వివిధ విభాగాల కింద 3000 ఉద్యోగాల వరకు రిలయన్స్ జియో సంస్థ భర్తీ చేయబోతోంది. వీటిలో 1000 ఉద్యోగాలు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు కావడం గమనార్హం. 


ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు, కొన్ని ప్రత్యేకమైన టెక్నికల్ నైపుణ్యతలు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఐ.టితో పాటు సేల్స్, మార్కెటింగ్ వంటి విభాగాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో అధికశాతం టెలికం నెట్‌వర్క్‌లలో నైపుణ్యం గలవారు ఈ ఉద్యోగం సాధించడం సులభం.  అలాగే కొన్ని ఉద్యోగాలు కంప్యూటర్ హార్డ్ వేర్ మరికొన్ని సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు కావాలని అందులో కోరారు.

తాజా ఆలోచనలను అందించే వ్యక్తులకి స్వాగతం పలుకుతున్నామనీ, అపరిమితమైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, డిజిటల్ ఇండియా ఉద్యమంలో భాగస్వాములు 
కావాలనుకునేవారు ముందుకు రావచ్చు అంటూ రిలయన్స్ జియో ప్రకటించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos