జియో నుంచి 4జీ ల్యాప్ టాప్స్

First Published 14, Apr 2018, 3:23 PM IST
Reliance Jio in talks with Qualcomm to launch laptops with cellular connectivity
Highlights
జియో మరో సంచలనం

టెలికాం రంగంలో జియో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతి తక్కువ ధరలకే మొబైల్ డేటా ఆఫర్ చేసి ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగించుకునేలా చేసింది. ఇప్పటికీ జియోతో పోటీ పడేందుకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా లంటి సంస్థలు నానా తిప్పలు పడుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే తాజాగా..  జియో మరో సంచలనానికి తెరలేపుతోంది.త్వరలో జియో తన వినియోగదారుల కోసం విండోస్ 10, 4జీ ఆధారిత ల్యాప్‌టాప్‌లను కూడా అందుబాటులోకి తేనుంది. 

టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌తో ఇప్పటికే 4జీ ఆధారిత విండోస్ 10 ల్యాప్‌టాప్‌ల తయారీపై చర్చలు జరుపుతున్నది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్‌టాప్‌లలో జియో 4జీ సిమ్ వేసుకుని ఆల్వేస్ కనెక్ట్ పద్ధతిలో ఎల్లప్పుడూ వినియోగదారులు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండే విధంగా నూతన తరహా ల్యాప్‌టాప్‌లను జియో తయారు చేయనుంది. ఈ మేరకు క్వాల్‌కామ్ సంస్థ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. 

అయితే కేవలం జియోతో కలిసి మాత్రమే కాకుండా మరో వైపు మన దేశానికి చెందిన స్మార్ట్రన్ బ్రాండ్‌తోపాటు విదేశాల్లోని హెచ్‌పీ, అసుస్, లెనోవో సంస్థలు, వెరిజాన్, ఏటీ అండ్ టీ, స్ప్రింట్ అనే టెలికాం ఆపరేటర్లతో కలసి కూడా క్వాల్‌కామ్ 4జీ ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నది. అయితే ఈ ల్యాప్‌టాప్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వివరాలను వెల్లడించలేదు.

loader