జియో ‘‘ఫుట్ బాల్ ఆఫర్’’..సూపర్

జియో ‘‘ఫుట్ బాల్ ఆఫర్’’..సూపర్

ప్రముఖ టెలికాం సంస్థ.. జియో.. ఆఫర్ల పేరుతో ఇతర టెలికాం సంస్థలకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పటికే జియో ఆఫర్ల తాకిడిని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ , వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థలు నానా తిప్పలు పడుతున్నాయి. కాగా.. ఈ సమయంలో జియో.. మరో ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

జియో ‘‘ఫుట్ బాల్ ఆఫర్’’ పేరిట మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ఈ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు రూ.2,200 వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇ‍వ్వనుంది. షియోమి, శాంసంగ్‌, మోటోరోలా, ఆసుస్‌, హువావే, పానసోనిక్, ఎల్‌జీ, నోకియా, మైక్రోమ్యాక్స్‌ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు  జియో ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌ కింద ఫోన్‌ యాక్టివేషన్‌ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్‌ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50. కాగా వీటిని  తర్వాత రీఛార్జ్‌ లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ వర్తిస్తుంది. మైజియో యాప్‌ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్‌ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్ పైర్ అయిపోతాయి. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos