జియో  ఫోన్ వినియోగదారులకు కంపెనీ.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఫోన్ వినియోగిస్తున్నవారి కోసం ప్రత్యేకంగా ఓ ప్లాన్ ని ప్రవేశపెట్టింది. కేవలం రూ.49తో రీఛార్జ్ చేసుకుంటే.. 1జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల పాటు ఈ ప్లాన్‌కు వాలిడిటీ ఉంటుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఇందులో వస్తాయి.

ఇక ఈ ప్లాన్‌తోపాటు రూ.11, రూ.21, రూ.51, రూ.101 పేరిట డేటా బెనిఫిట్స్‌ ను ఇచ్చే యాడాన్ ప్యాక్‌లను కూడా జియో తన 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం లాంచ్ చేసింది. ఇప్పటికే జియో తాను అందిస్తున్న పలు ప్లాన్ల డేటా బెనిఫిట్స్‌ ను పెంచగా, తాజాగా జియో ఫోన్ కోసం ఈ కొత్త ప్లాన్‌ను, యాడాన్ ప్యాక్స్‌ ను లాంచ్ చేయడం విశేషం.