రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్

Reliance Big TV HD Channels Effectively Free With HEVC SetTop Box
Highlights

  • వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్ 

వినియోగదారుల కోసం రిలయన్స్  బిగ్ టీవీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏడాది పాటు ఉచితంగా హెచ్ డీ ఛానెళ్లు వీక్షించే అవకాశం రిలయన్స్ బిగ్ టీవీ కల్పిస్తోంది. కాకపోతే.. అందుకు మీరు హెచ్ఈవీసీ సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మార్చి 1వ తేదీ నుంచి రియలన్స్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ హెచ్ఈవీసీ సెట్ టాప్ బాక్స్ బుక్ చేసుకోవచ్చు. అలా సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేసిన వారికి ఏడాదిపాటు ఉచితంగా హెచ్‌డీ ఛానెళ్లను ఆఫర్ చేయడమే కాకుండా మరో 500ల ‘ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్‌’ ను ఐదేళ్లపాటు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ సెట్ టాప్ బాక్స్ బుకింగ్ సమయంలో కనెక్షన్ కోసం రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు సెట్ టాప్ బాక్స్, అవుట్‌డోర్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేనికి వినియోగదారులు రూ.1500 రుసుము చెల్లించాలనే విషయాన్ని వినియోగదారులు గమనించగలరని తెలిపింది. ఒక ఏడాది సేవలు ముగిసిన తరువాత తర్వాతి రెండేళ్లపాటు ప్రతినెలా రూ.300లతో రీఛార్జి చేయాలని.. ఆ రెండేళ్లు పూర్తైయిన తరువాత బుకింగ్, ఇన్‌స్టాల్ చేసే సమయంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి కంపెనీ చెల్లిస్తుంది. బుకింగ్ చేసిన 30 రోజల తరువాత సెట్ టాప్ బాక్స్ ల డెలివరీ మొదలౌతుంది.

loader