షియోమి నుంచి మరో అద్భుతమైన స్మార్ట్ ఫోన్

Redmi S2 Specifications and Design Revealed via TENAA Listing
Highlights

ఇది సెల్ఫీ ఎక్స్ పర్ట్

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. ఇటీవల విడుదల చేసిన షియోమీ రెడ్‌ నోట్‌5 ప్రోకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లాష్‌ సేల్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయాలనుకునేవారికి నిరాశే ఎదురవుతోంది. పైగా ఇటీవల దీనిపై రూ.1000 కూడా పెంచింది. ఇక ఈ ఫోన్‌తో పాటు, కాస్త అటూ ఇటూగా రెడ్‌ 5, రెడ్‌మి నోట్‌5లను కూడా విడుదల చేసింది. ప్రోతో పోలిస్తే వీటికి ఆదరణ కాస్త తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అదనపు ఫీచర్లు జోడించి బడ్జెట్‌ ధరలో అదీ సెల్ఫీ ప్రియుల కోసం మరో స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేయనుంది. రెడ్‌మి 2ఎస్‌ పేరుతో గ్లోబల్‌ వెర్షన్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది.

ఫోన్‌కు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫొటోలు, టీజర్‌, ఫీచర్లు ఈ ఫోన్‌పై టెక్‌ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బడ్జెట్‌ ధరలో ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్‌ ప్రో ఎం1 తీసుకురావడం షియోమీకి గట్టి దెబ్బ తగిలినట్లయింది. దీంతో రెడ్‌మి 2ఎస్‌ను వేగంగా తీసుకువస్తోంది.  గురువారం చైనా మార్కెట్లోకి ..  ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్ అడుగుపెట్టి సందడి చేయనుంది.
ఇప్పటివరకు లీకైన సమాచారం మేరకు ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

షియోమి రెడ్ మి 2ఎస్ ఫీచర్లు..
5.99 (18:9)హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
2జీబీ/3జీబీ/4జీబీ ర్యామ్‌తో పాటు, 16జీబీ/32జీబీ/64జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం
12+5 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
16 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా విత్‌ సాఫ్ట్ ఫ్లాష్‌
డ్యుయల్‌ సిమ్‌ సదుపాయంతో పాటు, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మెమొరీని పెంచుకునే సదుపాయం
ఆండ్రాయిడ్‌ 8.1
3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader