చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి ఫోన్లు భారత మార్కట్ లో డిమాండ్ చాలా ఎక్కువ. ఇటీవల షియోమి.. రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్ 5 ప్రో పేరిట రెండు ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లను గతవారం(ఫిబ్రవరి 22వ తేదీన) మార్కెట్లోకి విడుదల చేయగా.. కేవలం మూడు నిమిషాల్లో 3లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని షియోమి అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఫోన్లు లభించని కష్టమర్లు మాత్రం చాలా నిరాశకు గురయ్యారు.

దీంతో..షియోమి మరోసారి ఈ ఫోన్ల సేల్ ప్రారంభించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్, ఎంఐ అధికారిక వెబ్ సైట్ లో ఈసేల్ ను ప్రారంభించారు. ఈ సేల్ లో ఈ రెండు ఫోన్లతోపాటు ఎంఐ టీవీ4 కూడా అందుబాటులో ఉంది.