చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి విడుదల చేసిన రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇటీవలే ఈ ఫోన్లను షియోమి విడుదల చేయగా.. గురువారం ఫ్లిప్ కార్ట్ లో వీటి సేల్ ప్రారంభించింది. కాగా.. సేల్ ప్రారంభించిన కేవలం పది సెకన్లలో ఫోన్లన్నీ అమ్ముడు కావడం విశేషం. దీనిని బట్టే అర్థం అవుతోంది.. షియోమి ఫోన్లకు భారత మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో. రెడ్ మీ నోట్4 విడుదల చేసిన సమయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సేల్ లో పెట్టిన ఫోన్లన్నీ ఒకేసారి అమ్ముడవ్వగా.. ఫోన్లు లభించని కష్టమర్లు మాత్రం నిరాశకు గురయ్యారు. ఫోన్ కొందామని ప్రయత్నిస్తుంటే.. అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది. మళ్లీ ఫోన్లు కొనుగోలు చేయాలంటే..మరో వారం రోజులు ఆగాల్సిందే.