చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. ఇటీవల రెడ్ మీ నోట్5, రెడ్ మీ నోట్ 5 ప్రో ఫోన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు ఫోన్లు గురువారం నుంచి వినియోగదారులకు లభ్యమౌతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ల సేల్ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. షిమోమి ఫోన్లకు భారత్ లో డిమాండ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన రెడ్ మీ నోట్4 ఫోన్లు హాట్ కేకుల్లా అమ్మడయ్యాయి. దానికి కొనసాగింపుగానే ఈ ఫోన్లను విడుదల చేశారు. ఈ రెండు ఫోన్లు కూడా బడ్జెట్ ధరలోనే విడుదల చేయడం విశేషం.

ఈ రెండు ఫోన్లు 4జీబీ, 6జీబీ వేరింయట్స్ లో లభ్యం అవుతున్నాయి. ఐఫోన్ ఎక్స్ తరహాలో ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమేరా ,ఎల్ఈడీ ఫ్లాష్ లభిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ సదుపాయం కూడా ఉంది. రెడ్ మీ నోట్ 5 ప్రోలో అత్యధికంగా 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలదు. 5.99 ఇంచెస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.