చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. ఇటీవల భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెడ్ మీ నోట్ 5, రెడ్ మీ నోట్5 ప్రో  పేరిట విడుదల చేసిన ఈ ఫోన్లు విడుదల చేయగానే.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కాగా.. తాజాగా రెడ్ మీ నోట్5 ప్రో వాడుతున్న కష్టమర్లకు షియోమి ఓ శుభవార్త తెలియజేసింది. ఈ ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో8.1  అప్ డేట్ ని తీసుకువచ్చింది.

ఫిబ్రవరి 14న భారత మార్కెట్లో విడుదలైన రెడ్ మీ నోట్ 5ప్రో లో ఆండ్రాయిడ్ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే MIUI 9 నిక్షిప్తం చేశారు. అయితే ఇదే ఫోన్ ఇటీవల చైనా మార్కెట్లో ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆధారంగా పనిచేసే MIUI 9తో విడుదల చేశారు. ఫోన్ ఫ్లాష్ చేసుకోవడం తెలిసిన వారు.. చైనాలో విడుదల చేసిన సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్లోకి మార్చుకోవచ్చు. 

అయితే.. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ సమస్యలు ఏమీ రాకుండా ఉండాలి అంటే.. ఇప్పుడు మీ దగ్గర వున్న రెడ్ మీ నోట్ 5 ప్రోలో ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆధారంగా పనిచేసే గ్లోబల్ డేటా రామ్  ని  ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ Beta ROM ప్రత్యేకంగా ఇండియా కోసం తయారు చేయబడటం వల్ల చైనా ROMలో మాదిరిగా ఎలాంటి లోపాలు ఉండవు. అయితే ఈ రామ్ వాడాలంటే మొదట మీ ఫోన్ బూట్‌లోడర్‌ని అన్ లాక్ చేయాలి. అనంతరం ఫ్లాష్ చేసుకోవాలి. అంతే మీ ఫోన్ లోకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అప్ డేట్ వచ్చేస్తుంది.