రెడ్ మీ5 ఫ్లాష్ సేల్..త్వరపడండి

Redmi 5 Flash Sale Today at 12pm via Amazon India, Mi.com
Highlights

అద్భుతమైన ఫీచర్లతో.. బడ్జెట్ ధరలో షియోమి మరో స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. భారత మార్కెట్లోకి ఇటీవల రెడ్ మీ 5 ఫోన్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఫోన్ ని ఇటీవల విడుదల చేయగా.. విపరీతంగా అమ్ముడయ్యాయి. తాజాగా.. వినియోగదారుల కోసం మంగళవారం స్పెషల్ ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఫోన్ ని కూడా షియోమి బడ్జెట్ ధరలోనే అందిస్తుండటం విశేషం. ఈ ఫోన్ భారీ వ్యూ హెచ్ డీ డిస్ ప్లేను కలిగి ఉంది.  అలాగే ముందు భాగంలో సెల్పీ కెమెరాకు ప్లాష్ ఉంది. రెడ్ మీ 4 కన్నా 11శాతం తక్కువ స్లీమ్ బాడీని ఈ ఫోన్ కల్గి ఉంది. ఈ ఫోన్ 2/3/4జీబీ ర్యామ్,6/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లభిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ మంగళవారం 12గంటలకు అమేజాన్, ఎం.కామ్ వెబ్ సైట్లలో ప్రారంభం అవుతోంది.

రెడ్ మీ 5 ఫోన్ ఫీచర్లు..
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే

720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్)

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)

3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

loader