హైదరాబాద్ నగరంలో శనివారం సంచలనం సృష్టించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. తుప్రాన్‌పేట టోల్‌గేట్ వద్ద కిడ్నాపర్ల చెరనుంచి అనంతయ్య తప్పించుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండ మాజీ సర్పంచ్ శేరిపల్లి అనంతయ్య కొంత కాలంగా చైతన్యనగర్‌లో నివాసం ఉంటూ నగరం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేస్తున్నాడు. శనివారం ఉదయం కాలనీలోని కిరాణం షాపు వద్దకు వెళ్ల్లి వస్తుండుగా ముందుగానే ఇండికా కారుల్లో సిద్ధంగా ఉన్న గుర్తు తెలియని దుండగులు అనంతయ్యను బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోయారు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.వ్యాపార ప్రత్యర్థులే అపహరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతయ్య క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.