కొద్దిపాటి మార్పులు చేసిన ఆర్ బిఐ

పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను ఆర్ బి ఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

రూ.2000 నోటు పై అనేక వదంతులు వచ్చాయి. కొందరు అందులో చిప్ పెట్టారని , రేడియోధార్మిక పదార్థం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

దీన్ని ఆర్ బిఐ ఖండించింది.

అయితే రూ. 2000 నోట్లలో కొన్ని ముద్రణా లోపాలు ఉన్నాయని ప్రకటించింది.

అలాగే, ఇటీవల విడుదల చేసిన రూ. 500 నోటులోనూ కొన్ని ముద్రణాలోపాలు ఉన్నట్లు ఒప్పుకుంది.

ఇప్పుడు రూ.500 నోటు లో స్వల్ప మార్పులు తీసుకరానున్నట్లు ప్రకటించింది.

ఇకపై కొత్త రూ. 500 నోటుపై ఉన్న రెండు నంబర్‌ ప్యానల్స్‌పై ‘ఆర్‌’ అనే అక్షరం అంతర్లీనంగా కన్పించనుంది.

మహాత్మాగాంధీ సిరీస్‌లో వస్తున్న ఈ నోటుపై 2016 సంవత్సరంతో పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.