ఉమేష్ యాదవ్ కు ఆర్బీఐ బంపర్ ఆఫర్

rbi job offer for cricketer umesh yadav
Highlights

  • క్రికెటర్ ఉమేష్ యాదవ్ కు మంచి ఆఫర్
  • పెద్ద ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఆర్బీఐ

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెత ఉమేష్ యాదవ్ జీవితంలో నిజమైంది. ఒకప్పుడు ఏ  చిన్న గ‌వ‌ర్న్‌మెంట్ ఉద్యోగం వ‌చ్చినా చాల‌నుకుని ఆటకు దూరంగా ఉన్నాడు.అలాంటిది అదే ఆట అతడిని అత్యున్నతమైన ఆర్బీఐ సంస్థలో అసిస్టెంట్ మేనేజ‌ర్‌ను చేసింది. 


ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఫ్రధాన బౌలర్ గా ఉన్న ఉమేష్ యాదవ్ ఒకప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికీ ప్రిపేర్ అయ్యాడు. కానీ క్వాలిపై కాలేక‌పోయాడు. కానీ ఏది జ‌రిగినా మ‌న మంచికే అన్న‌ట్లు భారత జట్టులో పేస్ బౌల‌ర్ గా నిరూపించుకున్న ఉమేష్,  ఇప్పుడు ఎంతో అత్యున్నతమైన ఆర్బీఐ సంస్థలో  ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని సాధించాడు.


స్పోర్ట్స్ కోటాలో దక్కిన ఈ జాబ్ లో నిజానికి చాంపియ‌న్స్ ట్రోఫీకి ముందే చేరాల్సింది. కానీ ఆటలో   బిజీగా ఉండటం వల్ల జాయిన్ కాలేకపోయాడు.  ఎప్ప‌టికైనా  పెద్ద ప్రభుత్వ  సంస్థ‌లో ఉద్యోగం సంపాదించాల‌న్న ఉమేష్ యాదవ్ కల ఈ విధంగా నెరవేరింది.

loader