త్వరలో విడుదల కానున్న కొత్త రు.50 నోటు

RBI announces new Rs 50 currency note
Highlights

కొత్త రు.50 నోటు వచ్చినా, పాత నోటు చలామణిలో ఉంటుందని రిజర్వు బ్యాంక్ తెలిపింది.

త్వరలో కొత్త రు.50 నోట్లు చలామణలోకి రానున్నాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో వస్తున్న ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటుంది.

 

ఈ బ్యాంకు నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ, మరోవైపు సాంస్కృతిక సంపద చిహ్నమయిన హంపీ రథం బొమ్మ ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

ఈ నోట్ల బేస్‌ కలర్‌ ఫ్లోర్‌సెంట్‌ బ్లూ అని ఈ బ్యాంకు నోటు పరిమాణం 66 mm x 135 mm గా ఉంటుందని బ్యాంక్ ఈ ప్రకటనలో తెలిపింది. కొత్త నోట్లు వచ్చినా, పాత రూ.50 కరెన్సీ నోట్లు కూడా చలామణిలో కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది.

నోటు పై భాగాన దేవనాగరి లిపిలో 50 అంకె,సూక్మ పరిమాణంలో  ఆర్ బిఐ, భారత్ అని దేవనాగరిలో ఉంటాయి. నోటు మధ్యలో మహాత్మగాంధీ బొమ్మఉంటుంది. కుడివైపు అశోక స్థంభం,  మహాత్మాగాంధీ చిత్రం, ఎలెక్ట్రోటైప్ వాటర్ మార్క్ ఉంటాయి.

 నోటు వెనక వైపున, నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ నినాదాం, లోగో, భారతీయ భాషల పానెల్,హంపీ రథం. దేవనాగరిలో 50అంకె లిపిలో ఉంటాయి.

 

 

 

loader