అన్ని స్కూళ్లు పాఠశాలకు, కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళతాం
గుంతకల్ రైల్వే జోన్ కోసం కేంద్రం మీద వత్తిడి పెంచేందుకు రాయలసీమలో పోస్ట్ కార్డ్ ల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

రాయలసీమ కు రైల్వే జోన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని, ఇవి భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి నాయకుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఈ దఫా పోస్ట్ కార్డ్ ల యుద్దానికి దిగుతున్నామని ఆయన ఏషియానెట్ కు చెప్పారు.
రాయలసీమ నుంచి కనీసం 20 వేల నుండి 50 వేల వరకు పోస్ట్ కార్డ్ లను కేంద్రం దృష్టికి తీసుకురాబోతున్నామని ఆయన తెలిపారు.

ప్రధాన మంత్రి కి రైల్వే మంత్రికి ఈ కార్డ్ లను పంపియ్యబోతున్నామని చెబుతూ భవిష్యత్తులో ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూాడా రాజశేఖర్ తెలిపారు.
గుంతకల్ రై ల్వే జోన్ సాధన సమితి.ఆధ్వర్యంలో వివిధ రాయలసీమ పల్లెల నుంచి పట్టణాల నుండి వెల్లువలా ఈ పోస్ట్ కార్డులను పంపియ్య బోతున్నామని ఆయన చెప్పారు.

ఆ ప్రచారంలో భాగంగా ఈ రోజు గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో గుంతకల్ లోని ఎస్ వి జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన సమావేశంలో
రాయలసీమ వెనుకబాటు గురించి చర్చించడం జరిగిందని, ఇలా అన్ని స్కూళ్లు పాఠశాలకు, కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళతామని ఆయన చెప్పారు.
ఈ పోస్ట్ కార్డ్ ల ఉద్యమాన్ని విడతల వారిగా చేపడుతూనే ఉంటాం, ఏదో ఒక రోజు రైల్వే జోన్ సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ప్రాంతంలో కేంద్రీకృతమవుతున్నాయి. రాయలసీమ వైపు ఎవరూ చూడటంలేదు. ఈ ప్రాంతాంలోయువకులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగడం లేదు. అందువల్ల గుంతకల్ ను రైల్వే జోన్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి, ఉపాధికి మార్గం ఏర్పడుతుంది. అందువల్లే గంతకల్ రైల్వే జోన్ కోసం ఉద్యమిస్తున్నాం,’ అని చెప్పారు.
