రాయల తెలంగాణా వచ్చి ఉంటే ఈ కష్టాలొచ్చేవా అని ఆంధ్రా టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ప్రతిపక్ష నేత జానారెడ్డి దగ్గిర గోడు ఎల్లబోసుకున్నారు

ఆంధ్రలో ఆయన ఏ మాత్రం హ్యాపీగా లేరు. అందుకే ఆయన ఇపుడు తన పడుతున్న రాజకీయ ఇబ్బందులను సెన్సేషనల్ స్టేట్ మెంట్సుగా ప్రజల ముందు పెడుతున్నారు. 
ఆయనెవరో తెలుసా ?

గెస్ !


క్లూస్ : 1. హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద, లాబీల్లో తరచూ విలేకరుతో కనిపించే ఏకైక లోక్ సభ సభ్యుడు
2. తనకు నాయకుడయినా ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చురకలేయడంలో ఆయన్ని మించిన వారెవరూ టిడిపి లేరు.
3. ఛ్చీ ఛ్చీ ఈ తుచ్ఛరాజకీయాల్లో ఉండలేకపోతున్నానని ఈ వైరాగ్యం చూపిన ఎంపి


ఈ పాటికి ఆయనవెవరో తెలుసుండాలి. తెలియని వాళ్ల కోసం... ఆయన పేరు జెసి దివాకర్ రెడ్డి, అనంతపురం లోక్ సభ సభ్యుడు.


బుధవారం నాడాయన తెలంగాణా అసెంబ్లీ కొచ్చి ప్రతిపక్షనాయకుడు కె. జానారెడ్డి కలుసుకుని, ఆంధ్రలో తాను అసంతృప్తిగా ఉన్నానన్న విషయాన్ని చాలా తెలివిగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన కు ముందు అనంతపురం కర్నూల్ జిల్లాలను తెలంగాణాలో కలిపి రాయల తెలంగాణా ఏర్పాటు చేయండని తాను కోరిన విషయం గుర్తు చేశారు.

అలా చేసి ఉంటే, రాయలసీమ కాంగ్రెస్, తెలంగాణా కాంగ్రెస్ కలసి కొత్త రాష్ట్రంలో కాంగ్రెస్ ని గెలిపించే వారు. (టిఆర్ ఎస్ పవర్లో ఉండేది కాదు, నీ కూ ఈ కష్టాలు వచ్చి వుండేవి కావు అనే అర్థం).


దివాకర్ రెడ్డి తన రాయల తెలంగాణ ప్రతిపాదనను జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ దాకా తీసుకువెళ్లారు. తెలంగాణా సమస్యకు జస్టిస్ శ్రీ కృష్ణ చూపించిన పరిష్కార సలహాలలో రాయల తెలంగాణా ఒకటి.

రాయలతెలంగాణా ఇవ్వక పోతే, అనంతపురాన్ని కర్నాటకలో కలపండని కూడ అన్నారు.

అంటే, ఆంధ్ర విడిపోతే, చంద్రబాబు నాయుడి పాలనలో తాను హ్యపీ ఉండలేనని వూహించారాయన. అది నిజమని తేలింది. తాను ఎంపి, సోదరుడు ఎమ్మెల్యే- అయినా టిడిపిలో వారికి తాటాకంత వెయిట్ కూడా లేదు. ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్దశ ఇదే. జిల్లాలో కమ్మ పెత్తనం జోరుగా ఉందని కూడా బాధపడ్డారు. చివరకు దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కూడా చేసే పరిస్థితి వచ్చింది.

 ఇలాంటపుడు అదేదో రాయలతెలంగాణ వచ్చి, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ కష్టాలొచ్చేవి కాదు. ఇపుడు చంద్రబాబుగారి ఆంధ్రలో ఉండ లేరు, టిడిపిలో కొనసాగలేరు. తెలంగాణాకు రాలేరు. కర్నాటక పారిపోలేరు.