ఇది రంగస్థలం రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?

First Published 29, Mar 2018, 3:52 PM IST
rangastalam hotel in hyderabad attracting cini lovers
Highlights
జనాలు విపరీతంగా ఈ రెస్టారెంట్ కి వెళుతున్నారు

ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రంగస్థలం. రామ్ చరణ్, సమంత జంటగా సుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు..  సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను  ఓ రెస్టారెంట్ యజమాని తన దైనశైలిలో ఉపయోగించుకుంటున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పేరు తెలియని వాళ్లు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తిలేదు. అంతగా ప్రాచుర్యం పొందింది. దీంతో.. సినిమా పేరును తన రెస్టారెంట్ కి పెట్టుకొని ఓ వ్యక్తి లబ్ధి పొందుతున్నాడు. హైదరాబాద్ నగరంలోని కోంపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. రెస్టారెంట్ పేరు ప్రస్తుతం ఆ పరిసర ప్రాంత ప్రజలను తెగ ఆకర్షిస్తోంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుందని  సమాచారం.

loader