ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ లాంటి ఎనిమిది ప్రముఖ ఇ-కామర్స్‌ పోర్టళ్లతో ఈ సంస్థ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. హరిద్వార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి.
దేశీయ మార్కెట్లోకి వేగంగా దూసుకువచ్చి సంచలనం సృష్టించినవి పతంజలి ప్రాడక్ట్స్. యోగా గురువు రామ్ దేవ్ బాబా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈ పతంజలి ప్రాడక్ట్స్... ఇక నుంచి ఆన్ లైన్ లోనూ లభ్యం కానున్నాయి. ఫ్లిప్కార్ట్, అమేజాన్ లాంటి ఎనిమిది ప్రముఖ ఇ-కామర్స్ పోర్టళ్లతో ఈ సంస్థ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. హరిద్వార్లో నిర్వహించిన కార్యక్రమంలో బాబా రామ్దేవ్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందాలు జరిగాయి.
ఈ సందర్భంగా రామ్దేవ్ మాట్లాడుతూ.. ఇ-కామర్స్ పోర్టళ్ల సాయంతో తమ ఉత్పత్తులు హరిద్వార్ నుంచి హర్ద్వార్(ప్రతి ఇంటి గుమ్మం ముందుకు)కు చేరుతాయన్నారు. ఈ ఏడాది 50వేల కోట్ల ఉత్పత్తులను తయారుచేస్తామని, వచ్చే ఏడాది నుంచి లక్ష కోట్ల ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇప్పటివరకు తమ సొంతపోర్టల్ www.patanjaliayurved.net లో సంస్థ ఉత్పత్తులు లభిస్తున్నాయి. అయితే ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఎనిమిది ప్రముఖ ఇ-కామర్స్ పోర్టళ్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం మాల్, 1ఎంజీ, బిగ్బాస్కెట్, గ్రోఫర్స్, షాప్క్లూస్, స్నాప్డీల్ పోర్టళ్లతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా పోర్టళ్ల ప్రతినిధులు, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ తదితరులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.
