Asianet News TeluguAsianet News Telugu

డేరా బాబా గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష

  • సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఈ తీర్పును వెలువరించారు
  • తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా గుర్మీత్ న్యాయస్థానాన్ని కోరారు.
Ram Rahim Gets 10 Years In Jail For Raping 2 Followers

అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు న్యాయస్థానం 20ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఈ తీర్పును వెలువరించారు. కాగా. తనకు క్షమాభిక్ష పెట్టాల్సిందిగా గుర్మీత్ న్యాయస్థానాన్ని కోరారు. అంతేకాకుండా కన్నీటి పర్యంతమై కుప్పకూలాడు. ఆయన అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నందున తేలిక పాటి శిక్ష విధించాలని ఆయన తరఫు న్యాయవాదులు కూడా కోరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు జైలు యూనిఫాం అందించి జైలుకు తీసుకువెళతారు.

జైలు శిక్షతో పాటు గుర్మీత్ కి రూ.30,20,00 జరిమానా కూడా విధించారు. 
ఇద్దరిని అత్యాచారం చేసినందుకు గాను.. ఒక్కో కేసుకి 10ఏళ్ల పాటు.. 20 సంవత్సరాలు శిక్ష ఖరారు చేశారు. ఆయనకు విధించిన జరిమానాలో రూ.14లక్షలు  మొదటి బాధితురాలకు, మరో రూ.14 లక్షలు రెండో బాధితురాలికి అందజేయనున్నట్లు కోర్టు తెలిపింది. ఒక వేళ విధించిన జరిమానా చెల్లించడంలో జాప్యం చేస్తే.. రూ.10వేలు జరిమానాతో మరో రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష పొడిగించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.జైలు శిక్షతో పాటు గుర్మీత్ కి రూ.30,20,00 జరిమానా కూడా విధించారు. 
ఇద్దరిని అత్యాచారం చేసినందుకు గాను.. ఒక్కో కేసుకి 10ఏళ్ల పాటు.. 20 సంవత్సరాలు శిక్ష ఖరారు చేశారు. ఆయనకు విధించిన జరిమానాలో రూ.14లక్షలు  మొదటి బాధితురాలకు, మరో రూ.14 లక్షలు రెండో బాధితురాలికి అందజేయనున్నట్లు కోర్టు తెలిపింది. ఒక వేళ విధించిన జరిమానా చెల్లించడంలో జాప్యం చేస్తే.. రూ.10వేలు జరిమానాతో మరో రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష పొడిగించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

న్యాయస్థానంలో కాకుండా గుర్మీత్ ని ఉంచిన రోహతక్ జైలు ప్రాంగణంలోనే న్యాయమూర్తి తీర్పు వెలువరించడం విశేషం. అంతేకాకుండా. ఈ ప్రాంతానికి న్యాయమూర్తి జగ్దీప్ సింగ్.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఇరు వైపు ల వారికి తమ వాదనలు వినిపించుకోవడానికి న్యాయమూర్తి పది నిమిషాల సమయం కేటాయించారు. గుర్మీత్ సింగ్ కి వీలైనంత ఎక్కువ శిక్ష విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ కోరారు.

తీర్పు నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి రోహ్‌తక్‌లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటుచేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గుర్మీత్‌ను ఉంచిన జైలుకు10 కిలోమీటర్ల వరకూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రోహతక్ కు అన్ని వైపులా రోడ్లను బ్లాక్ చేశారు.

గుర్మీత్‌ ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు 2002లో కేసు నమోదైంది. పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో గుర్మీత్‌ను దోషిగా తేలుస్తూ.. గత శుక్రవారం పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గుర్మీత్‌ను దోషిగా తేల్చడంతో అతడి అనుచరులుభారీ విధ్వంసానికి పాల్పడ్డారు. పంచకుల సహా పంజాబ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు దిగారు. వందల సంఖ్యలో కార్లకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios