ఎన్నికల ప్రచారనిమిత్తం ఎన్డీయే  రాష్ట్రపతి అభ్యర్థి రామనాధ్ కొవింద్ జూలై 4న అంధ్రప్రదేశ్, తెలంగాణాలకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్నఎంపీలు, ఎమ్మెల్యేల ను కలసి రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన హైదరాబాద్, అమరావతి సందర్శిస్తున్నారు.

ఎన్నికల ప్రచారనిమిత్తం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామనాధ్ కొవింద్ జూలై 4న అంధ్రప్రదేశ్, తెలంగాణాలకు వస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాలలో ఉన్నఎంపీలు, ఎమ్మెల్యేల ను కలసి రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు ఆయన హైదరాబాద్, అమరావతి సందర్శిస్తున్నారు.

జూలై 4న హైదరాబాద్ విమానాశ్రయంలో భాజపా ఎంపీ, ఎమ్మెల్యేలను కలుస్తారు.

తరువాత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను కలుస్తారు.

హరిత గెస్ట్ హౌస్ నందు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలుస్తారు.

పార్క్ హాయత్ హోటల్ లో వైకాపా నాయకులను కలుస్తారు.

3 గంటలకు గన్నవరం విమానశ్రయంకు చేరుకుంటారు.

విజయవాడ ఏ1 కన్వేన్షన్ సెంటర్ లో ముఖ్యమంత్రిగారు ఏర్పాటు చేసిన తేనీటి విందులో ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుస్తారు.

6 గంటలకు గన్నవరం నుండి ఢిల్లీ కి బయలుదేరుతారు.

ఈ విషయం ఆంధ్ర ఆరోగ్య మంత్రి , బిజెపి నేత కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.