‘సినిమాల్లో నయినా, రాజకీయంగా నయినా పవన్ బాబాయ్‌కి మెగా ఫ్యాన్స్ అండగా ఉండాలి’
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కు అనుకోకుండా,అకస్మికంగా కుటుంబం నుంచి భారీ మద్దతు లభించింది.
బాబాయ్ రాజకీయాలకు రామ్ చరణ్ తేజ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. చిరు ఫ్యామిలీ అభిమానులందరికి పిలుపు ఇస్తూ పవర్ స్టార్ కు అండగా ఉండాలని చెప్పారు. షూటింగ్ నిమిత్తం రామ్ చరణ్ ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు అభిమానులతో ముచ్చటించాడు. ఈ ముచ్చట రాజకీయాల్లోకి వెళ్లింది.
‘మీ అందరి మద్దతు బాబాయ్ కి ఉండాలి, అది సినిమాల్లో నయినా, రాజకీయంగా నయినా. పవన్ బాబాయ్కి మీరంతా అండగా ఉండాలి,’ అని పిలుపు నిచ్చాడు. ఇది మెగా అభిమానులందరికి ఇచ్చిన పిలుపే నని వేరే చెప్పాల్సిన పనిలేదు. గతంలోఎపుడూ రామ్ చరణ్ ఇలా బహిరంగ పిలుపు ఇవ్వలేదు. ఈపిలుపుతో ఆయన మెగా అభిమానులంతా ఒక రాజకీయ పంథాలోకి రమ్మని చెప్పాడు.
తండ్రి చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇలాంటపుడు ఆయన మెగా అభిమానులందరిని బాబాయ్ కి మద్దతునీయాలని కోరడం విశేషం. అంటే, చిరంజీవి మెల్లిగా రాజకీయాలనుంచి మెల్లిగా తప్పుకుంటారేమో.
ఈ పిలుపుతో తను కూడా బాబాయ్ వెంటే ఉన్నానని చెప్పకనే చెప్పారు.
ఇంకొక బాబాయ్ నాగబాబూ ఇప్పటికే పవన్ కు మద్దతు ప్రకటించారు.
