Asianet News TeluguAsianet News Telugu

కిశోర్ కుమార్ కి ‘భారతరత్న’ కోసం ప్రదర్శన

  • కిశోర్ కుమార్ కి భారత రత్న ఇవ్వాలని కోరుతూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
  • ఆగస్టు 4వ తేదీన కిశోర్ కుమార్ 88వ జయంతి
Rally in Kolkata demands Bharat Ratna for Kishore Kumar

 

ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ కి ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు  కోల్ కతాలో ఆయన అభిమానులు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. ఆగస్టు 4వ తేదీన కిశోర్ కుమార్ 88వ జయంతి  సందర్భంగా ఆయన అభిమానులు కోల్ కతాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

సంగీతానికి ఆయన చేసిన విశేష కృషి కి గాను ఆయనకు భారత రత్న ఇవ్వాలని పశ్చిమ బెంగాల్  రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రత్న శుక్లా డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని కూడా మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ మెమోరియల్ కల్చర్ అసోసియేషన్ సభ్యులు కోల్ కతాలో ర్యాలీ  నినర్వహించారు. ఈ అసోసియేషన్ కి మంత్రి లక్ష్మి రత్న శుక్లా కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.

కిశోర్ కుమార్.. కేవలం ప్లే బాక్ సింగర్ గానే కాదు.. నటుడిగానూ, లిరిసిస్ట్, కంపోసర్, ప్రోడ్యూసర్, డైరెక్టర్, స్ర్కీన్ రైటర్ గానూ చిత్ర సీమకు సేవలు అందించారు. మెలడీ పాటలకు ఆయన పెట్టింది పేరు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా ఆయన 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు  గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే.. ఆయన సంగీతంలో ఎలాంటి  శిక్షణ తీసుకోలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios